29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

స్వాగతం,బదిలీ ఘనంగా నిర్వహించుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,  మద్నూర్ :                                                                                                                                                                         

బదిలీపై నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు స్వాగతం పలుకుతూనే బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు వీడ్కోలు కార్యక్రమం మంగళవారం నిర్వహించుకున్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో బదిలీ పై  వెళ్లిన ఉపాధ్యాయులు మారుతి,రాజశ్రీ,చంద్రశేఖర్,చందర్,రాజు,బన్సీ రామ్,శోభరణి,రాజేందర్,నాగేశ్వర్ రావు లకు  ఘనంగా వీడ్కోలు పలికారు. దీంతో  పాటు నూతన ఉపాధ్యాయులకు స్వాగతం పలికారు.ఉపాధ్యాయులకు పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్, నోడల్ అధికారి  మల్లేశం, పిఆర్టీయూ నాయకులు శివరాం,భీమ్, మరోతి , ఉపాధ్యాయులు బస్వంత్ , విద్యార్థులు ఉన్నారు

More articles

Latest article