27.8 C
Hyderabad

భిక్కనూరులో వీధి కుక్కల దాడి

Stray dog ​​attack in Bhikkanur

Must read

📰 Generate e-Paper Clip

. . . 32 మేక పిల్లలు మృతి

. . . సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పశువైద్యురాలు డాక్టర్ జనుగం దివ్యశ్రీ

బిక్కనూర్, బతుకమ్మ :

బిక్కనూరు మండల కేంద్రంలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రె పిల్లలను శనివారం మండల పశువైద్యాధికారిని దివ్యశ్రీ తాసిల్దార్ సునీత, సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత పాడి రైతులు సిద్దిరాములు, రాములును వారు ఓదార్చారు. జీవనోపాధి కోసం పెంచుకుంటున్న మేక పిల్లలు ఒకేసారి మృత్యువాత పడటంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ దివ్యశ్రీ మాట్లాడుతూ మృతి చెందిన మేక పిల్లలకు నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు. అలాగే మిగిలిన జీవాలకు వీధి కుక్కల బారి నుండి రక్షణ కల్పించుకోవడానికి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో పశుసంవర్ధక శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Stray dog ​​attack in Bhikkanur

More articles

Latest article