. . . డైరీ రూపకల్పనపై కీలక నిర్ణయాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అమృత్ కుమార్ రెండవసారి ఎన్నికయ్యారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర సంఘం పరిశీలకులుగా సంతోష్ కుమార్, ముఖ్య అతిథిగా శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్ గా డాక్టర్ డి. హన్మంత్ రెడ్డి, కార్యదర్శి దండు స్వామి, కోశాధికారిగా జగదీశ్వర్ లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.2026 సంవత్సరానికి గాను జిల్లాలో సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని, కొత్తగా నియమితులైన గెజిటెడ్ అధికారులందరినీ సంఘంలో చేర్పించాలని తీర్మానించారు. బదిలీలు, పదోన్నతుల వల్ల ఖాళీ అయిన జిల్లా కార్యవర్గ పదవులను నూతన ఆఫీస్ బేరర్ల (కో-ఆప్షన్)ఏకగ్రీవంగా భర్తీ చేశారు.
. . . 2027 టీజీవో డైరీ, క్యాలెండర్ ముద్రించాలని తీర్మాణం
నూతన సంవత్సరం సందర్భంగా 2027 డైరీ, క్యాలెండర్ బాధ్యతను కార్యవర్గ సభ్యులకు అప్పగించారు. 2026 సంవత్సరానికి గాను జిల్లాలో సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని, కొత్తగా నియమితులైన గెజిటెడ్ అధికారులందరినీ సంఘంలో చేర్పించాలని తీర్మానించారు. బదిలీలు, పదోన్నతుల వల్ల ఖాళీ అయిన జిల్లా కార్యవర్గ పదవులను నూతన ఆఫీస్ బేరర్ల (కో-ఆప్షన్)ఏకగ్రీవంగా భర్తీ చేశారు. నూతనంగా ఎన్నికైన వారు సంఘం బలోపేతానికి, గెజిటెడ్ అధికారుల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, పరిశీలకులు సంతోష్ కుమార్ లు పిలుపునిచ్చారు.

