27.7 C
Hyderabad

కస్తూర్బా బాలికల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

Collector conducts surprise inspection of Kasturba Girls' School

Must read

📰 Generate e-Paper Clip

 

. . . స్టాక్ రిజిస్టర్ పక్కాగా నిర్వహించాలి

 

మాక్లూర్, బతుకమ్మ :  

 

మాక్లూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. వంట గది, స్టోర్ రూంలో సరుకుల నాణ్యత తనిఖీ చేశారు. విద్యార్థినుల కోసం సిద్ధం చేసిన ఆహారాన్ని పరిశీలించి, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక  ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. సరుకుల సరఫరా విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తేవాలని, స్టాక్ రిజిస్టర్ పక్కాగా నిర్వహించాలని సూచించారు. కాగా, గత కొన్ని రోజులుగా నిత్యావసరాలలో కొన్ని రకాల సరుకులను కాంట్రాక్టర్ పంపకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ దృష్టికి తేగా, ఎప్పటికప్పుడు నిత్యావసరాల కోసం విద్యా శాఖ ద్వారా ప్రత్యేకంగా నిధులను అందజేయించారు. నిత్యావసరాలు సమకూర్చే కాంట్రాక్ట్ ఏజెన్సీని సంప్రదించి సరుకులు సక్రమంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఏజెన్సీకి  షోకాజ్ నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్టులో పెడతామని కలెక్టర్ హెచ్చరించారు.

Collector conducts surprise inspection of Kasturba Girls' School

కాగా, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బయటి వ్యక్తులను లోనికి అనుమతించకూడదని ఆదేశించారు. ఇంటర్ మీడియట్ విద్యార్థినులకు నీట్ కోచింగ్ అందిస్తుండడం పట్ల కలెక్టర్ అభినందిస్తూ, అత్యధిక మందికి ప్రవేశాలు లభించేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా కేజీబీవీ విద్యార్థినులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి భేటీ అయ్యారు. వారికి పలు ప్రశ్నలు వేస్తూ అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన డైరీలు, చాక్లెట్లు, బహుమతులను అందించారు. చక్కగా చదువుకోవాలని, అదే సమయంలో వ్యక్తిగత భద్రత విషయంలో ఏమరుపాటుగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇంచార్జి డీఈఓ సాయాగౌడ్, ఎంఈఓ సత్యనారాయణ, కేజీవీవీ స్పెషల్ ఆఫీసర్ స్రవంతి తదితరులు ఉన్నారు.

Collector conducts surprise inspection of Kasturba Girls' School
 

More articles

Latest article