కస్తూర్బా బాలికల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

  . . . స్టాక్ రిజిస్టర్ పక్కాగా నిర్వహించాలి   మాక్లూర్, బతుకమ్మ :     మాక్లూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. వంట గది, స్టోర్ రూంలో సరుకుల నాణ్యత తనిఖీ చేశారు. విద్యార్థినుల కోసం సిద్ధం చేసిన ఆహారాన్ని పరిశీలించి, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక  ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు....