29.7 C
Hyderabad

చెవిలో పువ్వులు పెట్టుకుని కార్మికుల వినూత్న నిరసన

Workers' innovative protest: wearing flowers behind their ears

Must read

📰 Generate e-Paper Clip

 

. . .26 వేల కనీస వేతనం కోసం కార్మికుల ఆందోళన

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ, పేషెంట్ కేర్, శానిటేషన్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. చెవిలో పువ్వులు పెట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతినెలా 1వ తేదీన వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని కోరారు.అలాగే పండుగ సెలవులు, జాతీయ సెలవులతో పాటు మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో జైల్ సింగ్, సురేఖ, రాజ్ కుమార్, రాకేష్, అనురాధ, సంతోష్, రామ్ చరణ్, నరేందర్, సరిత, కళ్యాణి, శంకర్, సంగీత, నజియా, సాయిబాబా, డి. సాయిలు, గంగారాం తదితర కార్మికులు పాల్గొన్నారు.

More articles

Latest article