25.2 C
Hyderabad

80 క్వార్టర్స్ లో జరిగిన చోరి కేసు చేదింపు

Theft case in 80 Quarters solved

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇద్దరు నిందితుల అరెస్ట్

 

. . . బంగారు నగలు స్వాధీనం

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల 80 క్వార్టర్స్ ప్రాంతంలో జరిగిన దొంగతనం కేసును చేదించినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. సోమవారం నాగారం చౌరస్తా వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకోగా వారిద్దరిని శ్రీకాంత్, పైసల్ గా గుర్తించారు. ఇటీవల స్టేషన్ పరిధిలోని 80 క్వార్టర్స్ లో ఓ ఇంట్లో జరిగిన చోరి కేసులో శ్రీకాంత్, పైసల్ లే నిందితులని విచారణలో తేలిందన్నారు. వారి వద్ద నుంచి రెండు బంగారు చైన్లు, ఒక వెండి బ్రాస్‌లెట్, ఒక బంగారు ముక్కుపుడకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి,చట్టపరమైన చర్యల్లో భాగంగా న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

More articles

Latest article