29.2 C
Hyderabad

ఆలయాల పరిరక్షణ కు బీజేపీ ఆధ్యాత్మిక సెల్

BJP spiritual cell for the protection of temples

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీజేపీ ఆధ్యాత్మిక సెల్  నూతన కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్, బతుకమ్మ:

జిల్లాలోని ఆలయాల పరిరక్షణకు పాటుపడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. బీజేపీ ఆధ్యాత్మిక సెల్ నూతన కమిటీ సమావేశం గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నగర ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన ఆధ్యాత్మిక సెల్ హిందూ ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రధానంగా జిల్లాలో చారిత్రాత్మక ఆలయాలు ఎన్నో ఉన్నాయన్నారు. వాటి భూముల పరిరక్షణ చేపట్టాలన్నారు. ఆలయాలపై దాడులు వ్యతిరేక కార్యకలాపాలు ఎదిరించి ఆసరాగా నిలవాలని సూచించారు. హిందువులందరినీ కలుపుకొని సంస్కృతి, సంప్రదాయాలు భవిష్యత్తు తరాలకు అందేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఆలయ భూముల కబ్జాలను ఆక్రమణలు అడ్డుకోవాలని తెలిపారు. అనంతరం నూతన కమిటీలను నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ ఆధ్యాత్మిక సెల్ రాష్ట్ర కన్వీనర్ సూర్య ప్రకాష్ రావు, కో కన్వీనర్ నిరంజన్ దేశాయ్, జాయింట్ కన్వీనర్ నవీన్, జిల్లా కన్వీనర్ మేఘా సుబేదార్, రాష్ట్ర సలహాదారు ఉదయ్ మహారాజు, జిల్లా కో కన్వీనర్ రాజేష్, చంద్ర కాంత్ తదితరులు పాల్గొన్నారు.

BJP spiritual cell for the protection of temples

More articles

Latest article