కామారెడ్డి, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లాలో జూదం పై పోలీసుల మెరుపు దాడులు నిర్వహించారు. పండుగ సందర్భంగా జరుగుతున్న పేకాట వారోత్సవాలపై నియంత్రణ కోసం నాలుగు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా 9 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. జూదం ఆడుతున్న 50 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,06,390 నగదు,48 ఫోన్లు,18 బైకులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై గేమింగ్ యాక్ట్ కింద 9 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. జూదం సంపాదన మార్గం కాదు.. ఉన్నదాన్ని కోల్పోయే వ్యసనం.కష్టపడి సంపాదించండి.కుటుంబ భవిష్యత్తును కాపాడుకోండి అని పిలుపు నిచ్చారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసిన తరువాత జిల్లా వ్యాప్తంగా 15 కేసులు, 65 మందిని అరెస్టు చేసి రూ.2.68 లక్షల నగదు, 57 సెల్ పోన్ లు,23 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.

