కామారెడ్డి జిల్లాలో పేకాట పై ఉక్కుపాదం

  కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో జూదం పై పోలీసుల మెరుపు దాడులు నిర్వహించారు. పండుగ సందర్భంగా జరుగుతున్న పేకాట వారోత్సవాలపై నియంత్రణ కోసం నాలుగు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా 9 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. జూదం ఆడుతున్న 50 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,06,390 నగదు,48 ఫోన్లు,18 బైకులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై గేమింగ్ యాక్ట్ కింద 9 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు....