25.5 C
Hyderabad

దంపతులపై దాడి చేసిన ఇద్ధరి అరెస్ట్

Two arrested for attacking a couple

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆటో చోరి కేసు  వెలుగు లోకి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

 

చోరి చేసిన ఆటోలో వెళ్తూ మెల్లిగా వెళ్లమన్నందుకు బైక్ పై వెళ్తున్న దంపతులపై దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చోరి చేసిన ఆటోతో పాటు రాడ్ ను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ హెచ్ వో శ్రీనివాస్ తెలిపారు. మోపాల మండలం మంచిప్ప గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజుపై మెట్ పల్లి, కరీంనగర్, కమ్మర్ పల్లి, గంగాధర,కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, కామారెడ్డి, ఆర్మూర్, మోపాల్, నిజామాబాద్ 1వ టౌన్ పోలీస్ స్టేషన్ లో వాహనాల దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హరిజన వాడకు చెందిన రామాంజ విష్ణు ఆలియాస్ శంషాబాద్ విష్ణు పై నిజామాబాద్ 1వ టౌన్, రాజన్నసిరిసిల్లా జిల్లా ముస్తాబాద్, నిజామాబాద్ రూరల్, 4వ టౌన్, సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లలో చోరి కేసులలో నిందితులుగా ఉన్నారు. నిజామాబాద్ 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్మరి రాజు, శంషాబాద్ విష్ణులు ఆటోను చోరి చేసి పరారీలో ఉన్నారు. ఇటీవల నగరంలోని అంగడిబజార్ లో గల చాపల మార్కెట్ వద్ద ఇద్దరు దంపతులు బైక్ పై వెళ్తుండగా ఆటోలో ఉన్న రాజు, విష్ణులను మెల్లగా వెళ్లాలని అన్నందుకు వారిపై రాడ్ తో దాడి చేసి గాయపర్చారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తుండగా శనివారం రాజు, విష్ణులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఆటో, ఇనుప రాడ్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ హెచ్ వో తెలిపారు.

More articles

Latest article