23.4 C
Hyderabad

ఓటు హక్కును కాలరాసే సర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి

Municipal Commissioner inspected the attendance of sanitation workers

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో మౌన నిరసన

 

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక రైల్వే స్టేషన్ చౌరస్తాలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ఓటు హక్కును హరించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటి ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆధ్వర్యంలో చేపడుతున్న సర్ ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భారత రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా కొనసాగుతోందని విమర్శించారు. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయనే కారణాలు చూపుతూ లక్షలాది మంది అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్య అని అన్నారు. ఎన్నికల జాబితాలను సరిదిద్దే పేరుతో ప్రజల ఓటు హక్కును హరించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. 2002 నాటి పాత సాఫ్ట్‌వేర్‌లో నమోదైన పేర్లు, ఇంటి పేర్లలో ఉన్న స్పెల్లింగ్ పొరపాట్లను సాకుగా చూపుతూ ఓటర్లకు నోటీసులు జారీ చేయడం, తాతలు–ముత్తాతల గుర్తింపు పత్రాలు సమర్పించాలని కోరడం సాధారణ ప్రజలను అనవసర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. అనుభవజ్ఞులైన బూత్ లెవల్ అధికారుల స్థానంలో సరైన సాంకేతిక పరిజ్ఞానం లేని సిబ్బందితో సర్ ప్రక్రియ నిర్వహించడం వల్ల అనేక తప్పిదాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల పేర్లు తొలగించే పరిస్థితి ఏర్పడితే అది భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన పరిణామమవుతుందని అన్నారు. ప్రజల ఓటు హక్కును రక్షించాల్సిన ఎన్నికల సంఘమే ప్రజలలో భయాందోళనలు సృష్టించడం సమంజసం కాదన్నారు.ఈ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు, కుశాల్,కిషొర్,రంజిత్, సన్ని,నిరాజ్, నగేష్, విష్ణు, భాను తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article