22.4 C
Hyderabad

 ట్రాన్స్ జండర్లు సమాజంలో గౌరవప్రదంగా జీవించాలి

Transgender people should live with dignity in society.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ట్రాన్స్‌ జెండర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

ట్రాన్స్‌ జెండర్లు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా , సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించేందుకు కృషి చేయాలని సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం సూచించారు. బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో నిజామాబాద్‌ జిల్లా ట్రాన్స్‌ జెండర్లకు సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీశైలం మాట్లాడుతూ చట్టవిరుద్ధమైన చర్యలకు దూరంగా ఉండాలని , న్యూసెన్స్‌ కు పాల్పడకుండా శాంతియుతంగా వ్యవహరించాలని అన్నారు. అనంతరం ట్రాన్స్‌ జెండర్లు ఎదుర్కొంటున్న వ్యక్తిగత , సామాజిక సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత మార్గాల్లో సహాయం పొందాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా చట్టాన్ని ఆశ్రయించాలని , ఎవరూ నిరుత్సాహానికి గురికాకుండా గౌరవప్రదమైన జీవనం కొనసాగించాలని తెలిపారు. ట్రాన్స్‌ జెండర్లకు ఏవైనా సమస్యలు , ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 14427ను సంప్రదించాలని సూచించారు. ప్రజల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు , ట్రాన్స్‌ జెండర్ల సమస్యలను తెలుసుకొని వారికి తగిన మార్గదర్శకత్వం అందించడమే ఈ కౌన్సెలింగ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సమావేశంలో సిసిఎస్ సీఐ సురేష్  , అజయ్ ,  సాయినాథ్ ,  ఎస్సైలు మహేష్ , భీమ్రావు , మహిళ ఆర్ఎస్ఐ  స్రవంతి , సఖీ సెంటర్ ఇంచార్జి  భానుప్రియ జిల్లాలోని ట్రాన్సజెండర్లు పాల్గొన్నారు.

Transgender people should live with dignity in society.
Transgender people should live with dignity in society.

More articles

Latest article