. . . ఒకరు మృతి
గాంధారి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్ తండాలో ఇద్దరు మహిళల మధ్య జరిగిన ఘర్షణ విషాదాంతమైంది. పూర్ణ, మాధురి మధ్య గొడవ జరగగా పూర్ణ బ్యాట్‌తో మాధురిపై దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలైన మాదరిని గాంధారిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
