30.9 C
Hyderabad

బాల్కొండ ఇంచార్జి ఎస్సైగా యాసిర్ అర్ఫాత్

Yasir Arafat appointed as in-charge Sub-Inspector of Balkonda

Must read

📰 Generate e-Paper Clip

 

బాల్కొండ, బతుకమ్మ:

 

బాల్కొండ ఇంచార్జి ఎస్సైగా యాసిర్ అర్ఫాత్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు ఎస్సైగా పని చేసిన శైలేంధర్ పలు అవినీతి  ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. జిలా అధికారుల అనుమతి లేకుండా ఇద్దరు పోలీసులను మహారాష్ట్రకు పంపడం పట్ల జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. ఎస్సై శైలేంధర్ పై విచారణ కొనసాగుతుండగానే ఆయన స్థానంలో సీపీ ఇంచార్జిని నియమించినట్లు తెలిసింది. ఎస్సై యాసిర్ అర్పాత్ 2024లో బాల్కొండలో దాదాపు రెండు నెలలు విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న యాసిర్ అర్పాత్ ను బాల్కొండ  ఇంచార్జి ఎస్సైగా ఉన్నతాధికారులు నియమించారు.

More articles

Latest article