. . . రూ.2.57 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రులకు పొన్నం, అడ్లూరి శంకుస్థాపన
జగిత్యాల, బతుకమ్మ :
జగిత్యాల జిల్లా ధర్మపురి బస్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.2.57 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. బస్ స్టేషన్‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా రెండు ప్లాట్‌ఫారాల విస్తరణ, గ్రానైట్ ఫ్లోరింగ్, ఏసీపీ క్లాడింగ్, సీసీ పేవ్‌మెంట్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే ప్రయాణికుల అవసరాల కోసం కొత్త టాయిలెట్ బ్లాక్, సెప్టిక్ ట్యాంక్ నిర్మించనున్నారు. బస్ స్టేషన్ పైకప్పు మరమ్మతులు, వర్షపు నీటి పారుదల వ్యవస్థ మెరుగుదల, విద్యుదీకరణ, బోర్‌వెల్ ఏర్పాటు, ల్యాండ్‌స్కేపింగ్ తదితర పనులు కూడా చేపట్టనున్నారు.ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ధర్మపురి బస్ స్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. బస్ స్టేషన్‌ను ఆధునికంగా తీర్చిదిద్ది ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే ఈ పనుల ప్రధాన లక్ష్యమన్నారు.
. . . ధర్మపురిలో మంత్రుల ప్రత్యేక పూజలు
ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద రాష్ట్రానికి అదనంగా 2,200కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రూ. 3.22 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక బస్ టెర్మినల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
