జుక్కల్, బతుకమ్మ:
పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, సామాజిక బాధ్యత తదితర అంశాలపై, గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో మొక్కలు నాటుతూ సాగిన వసుంధర పాదయాత్రికులకు జుక్కల్ లో గణ స్వాగతం పలికారు. గత ఈనెల 27 న జుక్కల్ మండలం దోస్పల్లి బంగారు పల్లి గ్రామ శివారులో కొలువై ఉన్న జగద్గురు స్వామి నరేంద్ర చార్యాజి మహారాజ్ యొక్క తెలంగాణ ఉప పీఠం నుండి వేలాదిమంది భక్తులతో ప్రారంభమైన వసుంధర 28 రోజుల పాటు పాల్గొని పాదయాత్ర శనివారం జుక్కల్ కు చేరుకోవడంతో ఉపపీఠం నిర్వాహకులు, యాత్రికులకు ఘన స్వాగతం పలికారు..కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం లో డోస్పల్లి గ్రామ శివారులో గల ప్రసిద్ధిగాంచిన నరేంద్ర మహారాజ్ పుట్టినరోజు పురస్కరించుకొని జుక్కల్ మండలం నుంచి మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో నానీజ్ ధామ్ కు 600 కిలోమీటర్ సాగిన వసుంధర పాదయాత్ర పూర్తి చేసుకుని జూకల్ కు చేరుకున్న నరేంద్ర చార్య స్వామి భక్తులకు ఘన స్వాగతం లభించింది.
