26.2 C
Hyderabad

రెడ్ క్రాస్ అభివృద్ధికి సహకరిస్తా

I will contribute to the development of the Red Cross.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నూతన కార్యవర్గానికి అభినందించిన ఎంపీ ధర్మపురి అరవింద్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ శాఖకు తన వంతు సహకారం అందిస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన రెడ్ క్రాస్ కమిటీ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ బ్రాంచ్ చైర్మన్ పోతన్ కర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు బుధవారం న్యూ హౌసింగ్ బోర్డులోని ఎంపీ కార్యాలయంలో ధర్మపురి అరవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీకి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించి, సంస్థ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రెడ్ క్రాస్ సొసైటీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కమిటీ సభ్యులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మపురి అరవింద్ నూతన కమిటీకి అభినందనలు తెలుపుతూ రెడ్ క్రాస్ అభివృద్ధికి తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ సీను నాయక్, ట్రెజరర్ కెంపుల నాగరాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు దీకొండ యాదగిరి,సభ్యులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, సుభాష్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

I will contribute to the development of the Red Cross.
 

More articles

Latest article