. . . బతుకమ్మ నిమజ్జనం చేయబోయి చెరువులో జారిపడి వ్యక్తి మృతి
బిక్కనూర్, బతుకమ్మ :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భిక్కనూరు మండలం తిప్పపూర్ గ్రామ శివారులోని చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనం చేయబోతూ ప్రమాదవశాత్తు కాలు జారి పడి ఆర్టీసీ డ్రైవర్ ధర్మాగల స్వామి మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం . . . బతుకమ్మ నిమజ్జనం కోసం చెరువు అంచు వరకు వెళ్లిన స్వామి బురదలో కాలు జారి నీటిలో పడిపోయారు. స్థానికులు గమనించి బయటకు తీసేలోపే ప్రాణం కోల్పోయారు. సమాచారం అందుకున్న బిక్కనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. ధర్మాగల స్వామి మృతి పట్ల గ్రామస్తులు, ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. బతుకమ్మ నిమజ్జనం వేడుకల్లో చెరువుల వద్ద అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అనిల్ అన్నారు.
