24.9 C
Hyderabad

ఎనబై ఏళ్ల వృద్ధుడికి ఇరవై ఏళ్ల కఠిన జైలుశిక్ష

Twenty years of rigorous imprisonment for an eighty-year-old man

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ ఫోక్సో కోర్టు జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ తీర్పు

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ  :

 

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన ఎనభై ఏళ్ల కాలే పాండురంగా అనే వృద్ధుడికి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ స్పెషల్ ఫోక్సో కోర్టు సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ గురువారం తీర్పు చెప్పారు. ఫోక్సో కోర్టు ఇంచార్జి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ రూరల్ మండలం ఓ గ్రామానికి చెందిన పాండురంగా 17 మార్చి 2021న గ్రామ శివారులో ఎనిమిది సంవత్సరాల బాలికకు మాయమాటలు చెప్పి బట్టలు విప్పి లైంగికంగా దాడి చేశాడనే నేర అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు అయినట్లు నిర్దారిస్తూ ముద్దాయికి ఇరవై సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విదిస్తూ జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పు వెలువరించారు. లైంగికదాడికి గురైన బాలికకు నిజామాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ రెండు లక్షల ఆర్థిక పరిహారం అందజేయాలని జడ్జి తమ తీర్పులో సిపార్సు చేశారు.

More articles

Latest article