24.9 C
Hyderabad

మున్సిపల్ కార్మికులకు దసరాకు బట్టల పంపిణీ

Distribution of Dasara gifts to municipal workers

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని 45వ డివిజన్‌లో దసరా పండుగ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు  కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ , ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు బోబ్బిలి వేణు గోపాల్ లు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. శుక్రవారం ఎల్లమ్మ గుట్ట లోని తన నివాసంలో కార్పొరేటర్ సువర్ణ వేణుగోపాల్ దసరా పండుగను పురస్కరించుకుని 45వ డివిజన్ లో మున్సిపల్ కార్మికుల కు, వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్ విభాగంలో పనిచేస్తున్న వారికి కోత్త బట్టలు పంపిణీ చేశారు.  ఈ సంధర్బంగా వారు మాట్లాడుతు.. 45 వ డివిజన్ లో బల్ధియా తరుపున పనిచేస్తు ప్రజా ఆరోగ్యంలో కీలక పాత్ర పోశిస్తున్న వారిని గౌరవించుకోవాలని వారికి దసరా కానుకగా బట్టలను పంపిణి చేసినట్లు తెలిపారు.వారికి  దేవి నవరాత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరికీ అ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

Distribution of Dasara gifts to municipal workers

 

More articles

Latest article