32.3 C
Hyderabad

జీజీహెచ్ లో 750 బెడ్ లకు బడ్జెట్ పెంచి కార్మికులపై పనిభారం తగ్గించాలి

The budget for the 750 beds at GGH should be increased to reduce the workload on the workers

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిజిహెచ్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

ప్రభుత్వం, వైద్యశాఖ నిర్ణయించిన ప్రకారం వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 750 పడకలకు బడ్జెట్ ను పెంచి, సిబ్బంది పై పని భారం తగ్గించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓ మయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.సుధాకర్ లు డిమాండ్ చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ప్రతిరోజు అవుట్ పేషెంట్ 2500, ఐ పి 200 పైగా పెరగడం, ఎం సి హెచ్ బిల్డింగ్ లో పని వల్ల సిబ్బందిపై కార్మికులపై పని ఒత్తిడి పెరిగి, అనారోగ్యానికి గురి కావడం పట్ల  జిజిహెచ్ ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( ఎఐటియుసి) ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి సూపరిండెంట్ డాక్టర్.రాములు కి వినతి పత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓ మయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.సుధాకర్ మాట్లాడుతూ …కార్మికుల వేతనాల టెండర్ కాలపరిమితి ముగిసి సంవత్సరం పూర్తి అయినందున ప్రభుత్వం హామీ ఇచ్చిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్మికుల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జాతీయ-పండగ-ఆర్జిత సెలవులు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్  కోశాధికారి డి.భాగ్యలక్ష్మి, నాయకులు స్వరూప, భారతి,కవిత,సాయి, సునీత, సఫియా శానిటేషన్, పేషంట్ కేర్ సిబ్బంది పాల్గొన్నారు

More articles

Latest article