కమ్మర్‌పల్లి, బతుకమ్మ :
కమ్మర్‌పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోనగిరి భాస్కర్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ కార్డుల ద్వారా పేదలకు ఆహార భద్రతతో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందనున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సంజీవ్ యాదవ్, జైడి శ్రీనివాస్, సర్పంచ్ సంధ్య రాజశేఖర్, ఉపసర్పంచ్ కట్ట రాజు,రాకేష్, శేఖర్ స్థానిక ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
