28.2 C
Hyderabad

నిజాంసాగర్‌లో సంక్షేమ పథకాల సందడి

Bustle of welfare schemes in Nizamsagar

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  ఎమ్మెల్యే తోటలక్ష్మీకాంత్ రావుచే స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ  

 

  జుక్కల్, బతుకమ్మ :

జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి చెందిన వివిధ గ్రామాల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి – షాది ముబారక్ చెక్కులను డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Bustle of welfare schemes in Nizamsagar
 

More articles

Latest article