28.9 C
Hyderabad

2014 నియామక అధ్యాపకులకు పదోన్నతులు

Promotions for teachers recruited in 2014

Must read

📰 Generate e-Paper Clip

. . . వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరిరావు

డిచ్ పల్లి, బతుకమ్మ :

తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో నియమితులైన అధ్యాపకులు గత 8 సంవత్సరాలుగా పదోన్నతుల కొరకు ఎదురు చూస్తున్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వుల ఆధారంగా గత నెల 24వ తేదీన తెలంగాణ సెక్రటేరియట్ లో పూర్తి స్థాయి తెలంగాణ విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి తొలి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా నివేదిక ఆధారంగా పదోన్నతులు కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యనిర్వాహక మండలి తీర్మానం మేరకు 29 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు స్క్రీనింగ్ , ఎవాల్యూషన్ ధరఖాస్తులను ఈ నెల 17న క్లాస్ వన్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రాష్ట్ర ఉన్నత విద్యాకార్యదర్శి డా . యోగితా రాణా, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సిక్తా పట్నాయక్, కాలేజియేట్ కమిషనర్ దేవసేనతో పాటుగా క్లాస్ టూ ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ ప్రో.సి.హెచ్. ఆంజనేయులు, డా.సుధాకరగౌడ్ , డా. మదన్ మోహన్ , జయంత్ , లావణ్య , గాజి , సంజీవరావు , డాక్టర్ దండు స్వామి, రజనీకాంత్ లు ఆమోదించినారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ యాదగిరి రావు ఆదేశాలమేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి అధ్యాపకులకు పదోన్నతి ఉత్తర్వులను అందజేశారు.

More articles

Latest article