28.9 C
Hyderabad

ఐడిఓసి కాంప్లెక్స్ లో తల్లులు పిల్లలకు పాలిచ్చే క్యాబిన్లు ప్రారంభం

Nursing cabins for mothers inaugurated at the IDOC complex

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ ఐడిఓసి కాంప్లెక్స్ లో తల్లులు తమ చిన్నారులకు సౌకర్యవంతంగా, గోప్యతతో పాలిచ్చేందుకు ఏర్పాటు చేసిన బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్లను ప్రారంభించారు. సోమవారం మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ, జిల్లా మహిళా సాధికారిక కేంద్రం  ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని  జిల్లా రెవెన్యూ అధికారి గీత, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రాజశ్రీ,  జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా సంక్షేమ అధికారి సౌందర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఉద్యోగులు, సందర్శకులు, ఐడిఓసి కాంప్లెక్స్‌కు వచ్చే తల్లులు తమ శిశువులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పాలిచ్చేందుకు ఈ క్యాబిన్లు ఉపయోగపడతాయని తెలిపారు. శిశువులకు తల్లిపాలు అందించడం వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో ముఖ్యమని, తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమం ద్వారా బాలికల సంరక్షణ, విద్య, ఆరోగ్యం, మహిళల సాధికారతకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. తల్లులు, శిశువుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి సిడిపిఓ ఫర్హత్,  సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ మహిపాల్, కుమారి ప్రణతి,  స్వప్న, జెండర్ స్పెషలిస్ట్ లు, స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షి లిటరసీ, అకౌంటెంట్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Nursing cabins for mothers inaugurated at the IDOC complex
 

More articles

Latest article