ఐడిఓసి కాంప్లెక్స్ లో తల్లులు పిల్లలకు పాలిచ్చే క్యాబిన్లు ప్రారంభం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ ఐడిఓసి కాంప్లెక్స్ లో తల్లులు తమ చిన్నారులకు సౌకర్యవంతంగా, గోప్యతతో పాలిచ్చేందుకు ఏర్పాటు చేసిన బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్లను ప్రారంభించారు. సోమవారం మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ, జిల్లా మహిళా సాధికారిక కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి గీత, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రాజశ్రీ, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా సంక్షేమ అధికారి సౌందర్యలు ప్రారంభించారు....