31 C
Hyderabad

సాంప్రదాయ డప్పులు, వాయిద్యాలతోనే గణేష్ నిమజ్జనాలు చేయాలి

Ganesh immersions should be conducted using only traditional drums and musical instruments

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కామారెడ్డి ప్రజలందరూ మన కుటుంబ సభ్యులుగా భావించాలి

 

. . . నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే కేసులు తప్పవు

 

. . . డీజే నిర్వాహకులతో కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ :

కామారెడ్డి జిల్లాలో రాబోయే గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపులకు సాంప్రదాయ డప్పులు, వాయిద్యాలతోనే నిమజ్జనాలు చేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు.  పోలీసు కార్యాలయంలో డీజే నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన ఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులేనని, డీజే ఆపరేటర్లు కూడా మన సభ్యులేనని మన అందరి క్షేమం, భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. మన కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా డీజేల వల్ల ప్రాణహాని, ఇబ్బందులు కలుగవద్దని, వినాయక నిమజ్జనంలో ఎలాంటి అపశ్రుతులు జరుగకుండా ఉండేందుకు జిల్లాలో ఎక్కడా డీజేలకు అనుమతి లేదని నిర్వాహకులకు, డీజే ఆపరేటర్లకు స్పష్టం చేశారు. గతేడాది కూడా కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జనంలో ఎక్కడ కూడా డీజే ఉపయోగించకుండా సాంప్రదాయ డప్పులు, వాయిద్యాల, నృత్యాలతో ఎంతో వైభవంగా నిమజ్జనం నిర్వహించుకున్నామని అదే స్పూర్తిని ఈ యేడాది కొనసాగిద్దామని ఎస్పీ తెలిపారు. డీజేల వినియోగం నిషేదం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో గణేష్ కమిటీ లనుంచి అడ్వాన్స్ లు తీసుకోవద్దని ఎస్పీ ఆదేశించారు. ఎవరైనా డబ్బులు తీసుకుంటే వెంటనే సంబంధిత నిర్వాహకులకు తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు. ఎవరైనా డీజేలు ఏర్పాటు చేసినా నిర్వాహకులు, ఆపరేటర్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. గణేష్ ఉత్సవాల నిమజ్జనంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా జిల్లా పోలీసు శాఖ అన్ని ముందస్తు భద్రత చర్యలు చేపడుతుందని, ప్రజలందరూ పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article