28.9 C
Hyderabad

ముబారక్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆయుర్వేదంపై అవగాహన

Awareness on Ayurveda for Mubarak Nagar Government School students

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

జడ్పిహెచ్ఎస్ ముబారక్ నగర్ లో విద్యార్థిని, విద్యార్థులకు ఆయుర్వేదం పట్ల జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డా. గంగాధర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పాఠశాలలో ఆయుష్ శాఖ డైరెక్టర్, ఆయుష్ అర్ డి డి వరంగల్ ఆదేశాల మేరకు దినచర్య, ఋతుచర్య, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ప్రపంచంలో ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థిని, విద్యార్థులకు యోగా వైద్యులు డా.తిరుపతి యోగాసనాలు వేయించి యోగా వైద్యం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాష్టార్ హనుమంతరావు, ఆయుష్ వైద్యులు డాక్టర్  ఫసియోద్దీన్, శ్రీవాణి, ఆయుష్ ఫార్మసిస్ట్ పురుషోత్తం, ఉమా ప్రసాద్, యోగా శిక్షకులు, పారామెడికల్ సిబ్బంది,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Awareness on Ayurveda for Mubarak Nagar Government School students
Awareness on Ayurveda for Mubarak Nagar Government School students

More articles

Latest article