ముబారక్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆయుర్వేదంపై అవగాహన
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : జడ్పిహెచ్ఎస్ ముబారక్ నగర్ లో విద్యార్థిని, విద్యార్థులకు ఆయుర్వేదం పట్ల జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డా. గంగాధర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పాఠశాలలో ఆయుష్ శాఖ డైరెక్టర్, ఆయుష్ అర్ డి డి వరంగల్ ఆదేశాల మేరకు దినచర్య, ఋతుచర్య, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ప్రపంచంలో ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థిని, విద్యార్థులకు యోగా వైద్యులు డా.తిరుపతి యోగాసనాలు వేయించి యోగా...