29.2 C
Hyderabad

శివాజినగర్ లో వ్యక్తి దారుణహత్య

Man brutally murdered in Shivajinagar

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కారులో వచ్చి కత్తితో నరికి హత్య

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలోని శివాజినగర్ లో దారుణం జరిగింది. పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణ హత్య చేశారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. స్థానికంగా ఉన్న గిరిరాజ్ అపార్ట్ మెంట్ వద్ద ఉన్న పానీపూరి బండి వద్ద ఉన్న వ్యక్తిపై కారులో వచ్చిన ముగ్గురు కొబ్బరిబొండలు నరికే కత్తితో దాడి చేసి హతమార్చారు. ప్రజలందరూ చూస్తుండగానే జరిగిన ఈ హత్య కలకలం రేపింది. హతుడెవరు, హంతకులు ఎవరనేది తెలియాల్సి ఉంది. స్థానిక 2వ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. స్థానికంగా సీసీటీవీ పుటేజిలను పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నగరంలో పట్టపగలు జరిగిన హత్యతో జనాలు ఉలిక్కిపడ్డారు.

More articles

Latest article