27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పోలీసుల రక్తదానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం పోలీసు ఫ్లాగ్ డే నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్  లో రక్తదాన  శిబిరం నిర్వహించగా అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్)  కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది చేస్తున్న రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానమవుతుందన్నారు. రక్తదానం సామాజిక సేవ అని, ప్రాణాపాయ స్థిలో ఉన్న  వారిన ప్రాణాలను మనమిచ్చే రక్తం కాపడుతుందన్నారు. శిబిరంలో సుమారు 49 మంది పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. శిబిరంలో ఆర్మ్డ్ రిజర్వ్ ఏసీపీ నాగయ్య, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, పోలీస్ యునిట్ ఆఫీసర్ డాక్టర్ సరళ, రిజర్వ్ ఇన్ స్పెక్టర్ సతీశ్ కుమార్, శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ డాక్టర్ రాజేశ్, కర్ప రవీందర్ ( ట్రెజరర్ ), హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ మెనేజర్లు రమాకాంత్,  వెంకటసుబ్బయ్య, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్ పాషా, పోలీస్ ఆస్పత్రి సిబ్బంది దేవగౌడ్, స్పెషల్ పార్టీ సిబ్బంది హాజరయ్యారు. రక్తదానం చేసిన వారిలో టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్ – 1 ఎస్ హెచ్ వో  రఘుపతి, ఆర్ ఐ (ఎంటీవో) తిరుపతి, ఏఆర్ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులు తదితరులు రక్తదానం చేశారు.

Police Blood Donation

More articles

Latest article