29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఖర్చులు తగ్గించుకోలేక విద్యుత్ చార్జీలు పెంచుతున్నారు

Must read

📰 Generate e-Paper Clip

. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ ప్రజలపై భారం మోపుతోంది

. పదేళ్లలో మేం ఏనాడూ చార్జీలు పెంచలేదు

. ఫిక్స్డ్ చార్జీలు పెంచితే ప్రజలపై తీవ్ర భారం

నిజామాబాద్, బతుకమ్మ: విద్యుత్ ఉత్పత్తిలో ఖర్చులు తగ్గించుకోలేక చార్జీలు పెంచుతామనడం తగదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ర్ట విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో  కలెక్టరేట్ లో గురువారం విద్యుత్ చార్జీల పెంపుపై నిర్వహించిన  బహిరంగ విచారణలో ప్రశాంత్ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి  గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ  గౌడ్ పాల్గొన్నారు. బహిరంగ విచారణ అనంతరం ప్రశాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. విద్యత్ చార్జీల పెంపును తాము సమర్థిస్తున్నామని కాంగ్రెస్ కిసాన్ ఖేత్ నాయకుడు శశిభూషణ్  విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ముందు పేర్కొనడం కాంగ్రెస్ స్టాండ్ ను తెలియజేస్తోందన్నారు. రూ.10గా ఉన్న ఫిక్స్డ్ చార్జీని రూ.50కి పెంచాలని నిర్ణయించారని, ఈ నిర్ణయం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. 300 యూనిట్లకుపైగా విద్యుత్ ను వినియోగించే వారికే పెంపు వర్తిస్తుందని అంటున్నారని, ఈ రోజుల్లో 300 యూనిట్ల వినియోగం మామూలు విషయమేనని పేర్కొన్నారు. కరెంటు చార్జీలు పెంచడం లేదంటూనే ఫిక్డ్స్ చార్జీలను పెంచుతూ భారం  మోపుతున్నారన్నారు. ఈ నిర్ణయాన్ని ఒప్పుకోవద్దని తాము కమిషన్ కు విన్నవించినట్లు తెలిపారు. చార్జీల  పెంపు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, పరిశ్రమలు మూతపబడితే లక్షలాది మంది రోడ్లపై పడుతారన్నారు. సిమెంట్, స్టీల్ తదితర వాటి ధరలు పెరిగి మళ్లీ సామాన్యులకు తీవ్ర  భారం పడుతుందన్నారు. గతంలో చార్జీలు పెంచుతామని డిస్కంలు విన్నవిస్తే సీఎం హోదాలో కేసీఆర్ తిరస్కరించారని గుర్తు చేశారు. ఏది ఏమైనా విద్యుత్ చార్జీల పెంపునుతాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

పార్టీలు మారిన వారిని డిస్ క్వాలిఫై చేయాలి

పార్టీలు మారిన వారిని డిస్ క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేయడాన్ని తాము ఆహ్వానిస్తున్నామని, సీఎం రేవంత్, స్పీకర్ ప్రసాద్, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పార్టీమారిన వారిని డిస్ క్వాలిఫై చేసి ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్  ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ర్టంలో పోలీసు పాలన నడుస్తోందని ఆరోపించారు.

More articles

Latest article