ఖర్చులు తగ్గించుకోలేక విద్యుత్ చార్జీలు పెంచుతున్నారు
. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ ప్రజలపై భారం మోపుతోంది . పదేళ్లలో మేం ఏనాడూ చార్జీలు పెంచలేదు . ఫిక్స్డ్ చార్జీలు పెంచితే ప్రజలపై తీవ్ర భారం నిజామాబాద్, బతుకమ్మ: విద్యుత్ ఉత్పత్తిలో ఖర్చులు తగ్గించుకోలేక చార్జీలు పెంచుతామనడం తగదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ర్ట విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో గురువారం విద్యుత్ చార్జీల పెంపుపై నిర్వహించిన బహిరంగ విచారణలో ప్రశాంత్ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ...