27.7 C
Hyderabad

మన్మథ్ స్వామి పాదయాత్ర కరపత్రాల ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ: శ్రీక్షేత్ర కపిలధార్ మన్మథ్ స్వామి పుణ్యక్షేత్రానికి చేపట్టనున్న 15వ మహాపాదయాత్ర కరపత్రాలను ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వరదేశాయి, జిల్లా న్యాయస్థాన ఇన్ చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్ రావు ఆవిష్కరించారు. సుంకిని సిద్ధేశ్వర్ మహరాజు, మల్లికార్జున అప్ప, సంతోష్ మహరాజ్ సారథ్యంలో వీరశైవ జంగమ – లింగాయత్ సమాజ్ సౌజన్యంతో నవంబర్ 2న బోధన్ పట్టణంలోని పురాణే (పౌడయ్య) మఠం నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ నేతృత్వంలో పాదయాత్ర ప్రారంభం కానుంది. వీరశైవ జంగమ సమాజ్ పట్టణ అధ్యక్షుడు ఎం నర్సింగ్ అప్ప, ఉపాధ్యక్షులు పౌడయ్య రాజేందర్ కుమార్, లింగాయత్ సమాజ్ ప్రముఖులు యాదవ్ పటేల్, పురాణే అజయ్ కుమార్, పురాణే దిలీప్ కుమార్, ఎం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

More articles

Latest article