. . . మైనర్ పై లైంగిక దాడి ఆరోపణలపై చర్యలు
. . . పదవికి రాజీనామా చేయాలని అదేశం
హైదరబాద్, బతుకమ్మ:
హైదరాబాద్ మజ్లిస్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ ను తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మజ్లిస్ నేత ఓవైసీ ఆదేశాలు జారీ చేశారు. ఆయనను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి పార్టీ జాయింట్ సెక్రటరి ఎస్.ఏ. హుస్సెన్ అన్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఎమ్మెల్సీ బేగ్ బాలికపై అత్యాచారానికి ప్రయత్నిస్తుండడం కొంతమంది యువకులు అతడిని పట్టుకుని కొట్టడం, ఇవన్నీ కూడా వీడియోలో ఉన్నాయి. దీంతో తనపై చర్య అనివార్యమని పోలీస్ కేసు పెట్టే అవకాశం ఉందని తేల్చుకున్న బేగ్ ముందుగానే పోలీసులను అశ్రయించాడు . తనపై డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలు చేస్తున్నారని అందువల్ల చర్య తీసుకోవాలంటూ ముందు జాగ్రత్తగా పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే ఈ సంఘటనపై నివేదిక తెప్పించుకున్న ఓవైసీ, వీడియోల ఆదారంగా జరిగిన సంఘటన వాస్తవమేనని నిర్ధారించి ఆయనను నోటీసు, వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ లో తొలిసారి మజ్లీస్ పార్టీ తన ప్రజా ప్రతినిధిని రాజీనామా కోరినట్టయింది. అయితే ఈ వ్యవహరం పతంగి పార్టికి తీవ్ర మచ్చని తెచ్చింది.
. . . ఎమ్మెల్సీ పై వేటుపై విమర్శలు
మైనర్ పై లైంగిక దాడి ఆరోపణలపై ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ పై వేటు వేయడాన్ని ప్రతిపక్షలు విమర్శలు చేశారు. ముందుగా ఎమ్మెల్సీని కాపాడేందుకు మజ్లీస్ పార్టీ ప్రయత్నించిందని బిజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. రహ్మత్ బేగ్ భూ కబ్జాల వ్యవహరంలో చాలా ఆరోపణలు ఉన్న ఓవైసీ చర్యలు తీసుకోలేదని, లైంగిక దాడి విడియోలు బహిర్గతం కావడంతో అర్ధరాత్రి హడావిడిగా చర్యలు తీసుకున్నారన్నారు. ప్రైవేట్ వీడియోలతో పార్టీ పరువు పోంతుందని ఓవైసీ సోదరులు మీడియా ముందుకు రాకుండా పార్టీ జాయింట్ సెక్రటరిచేత అది సోషల్ మీడియాలో పోస్టు చేశారని విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ రహమత్ బేగ్ ను ఎందుకు బహిష్కరించారో ప్రజలకు ఓవైసి జవాబు చేప్పాలని బిఆర్ఎస్ నాయకుడు సల్మాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీతో పాటు ఒక ఎమ్మెల్యే, ఒక కార్పోరేటర్ కుడా ఉన్నారని వారిపై దానికి సంబంధించిన ఆదారాలు ఉన్నాయని చర్యలు తీసుకుంటారా అని సవాల్ విసిరారు.
