27.6 C
Hyderabad

గంజాయి పట్టివేతపై చర్చ…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు నిఘా పెంచాలి…

 

రుద్రూర్ (పోతంగల్‌), బతుకమ్మ :

 

పోతంగల్ మండలంలోని మంజీర నది చెక్ పోస్ట్ వద్ద మంగళవారం గంజాయి పట్టుబడినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. పట్టుబడిన గంజాయి పరిమాణం ఎంత, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. పట్టుబడిన గంజాయి మహారాష్ట్ర వైపు తరలుతుండగా పట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. యువతపై మత్తు పదార్థాల ప్రభావం పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

More articles

Latest article