27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

Must read

📰 Generate e-Paper Clip

బోదన్, బతుకమ్మ:

ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు  ఢీకొని ఓక వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బోధన్ పట్టణంలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ కు చెందిన ఎంబటి వెంకటి అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా పాత బస్టాండ్ ప్రాంతంలోని మారుతి మందిరం వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. కాలికి ఎముక విరిగి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు 108 అంబులేన్స్ లో జిల్లా  కేంద్ర ఆస్పత్రికి వైద్యం నిమిత్తం తరలిం,ారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More articles

Latest article