28.2 C
Hyderabad

ఎస్సారెస్పీలోకి తగ్గుతున్న వరద

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి వరద ప్రవాహం మంగళవారం ఉదయం నుంచి క్రమంగా తగ్గుతుంది. ఉదయం 6 గంటలకు 56,987 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. దీంతో 12 గేట్ల ద్వారా 42,533 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ఉదయం 9 గంటలకు 39,446 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. వరద ప్రవాహం తగ్గడంతో 4 గేట్లు మూసి 8 గేట్ల ద్వారా 24992 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి నీటి విడుదల కొనసాగించారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 26,950 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మరో 4 గేట్లు మూసి ప్రస్తుతం 4 గేట్ల ద్వారా 12,496 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్కులు, ఎస్కేఫ్ గేట్ల ద్వారా 4000 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 5000 క్యూసెక్కులు, సరస్వతి కాల్వ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వ ద్వారా 150 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.501 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

More articles

Latest article