ఎస్సారెస్పీలోకి తగ్గుతున్న వరద
బతుకమ్మ, మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి వరద ప్రవాహం మంగళవారం ఉదయం నుంచి క్రమంగా తగ్గుతుంది. ఉదయం 6 గంటలకు 56,987 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. దీంతో 12 గేట్ల ద్వారా 42,533 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ఉదయం 9 గంటలకు 39,446 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. వరద ప్రవాహం తగ్గడంతో 4 గేట్లు మూసి 8 గేట్ల ద్వారా 24992 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి నీటి విడుదల కొనసాగించారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 26,950 క్యూసెక్కుల...