26.2 C
Hyderabad
Wednesday, August 5, 2026

ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగి ఉంటుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సర్పంచ్ పెగడ విజయ్ కుమార్

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్లో ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందని, సరైన క్రమంలో తర్ఫీదు పొంది మెలకువలు నేర్చుకున్నట్లయితే ప్రతి క్రీడా కారుడికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గ్రామ సర్పంచ్ పెగడ విజయకుమార్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో గల యువ క్రీడాకారులకు బుధవారం క్రికెట్ కిట్లను ఆయన అందజేశారు. క్రీడాకారులకు క్రీడల విషయంలో అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని క్రీడాకారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయిరాం, యువ క్రీడాకారులు నర్సారెడ్డి, మధు, నవీన్, బన్నీ, రవితేజ, నందు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article