బాల్కొండ, బతుకమ్మ :
బాల్కొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చాట్ల నరేష్, జిల్లా కార్యదర్శి మహమ్మద్ యునుస్, బాల్కొండ ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు పుప్పాల విద్యాసాగర్, వార్డు సభ్యుడు పిట్ల దయాకర్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు సయ్యద్ మజారుద్దీన్, మహమ్మద్ అన్వర్, నాయకులు గడ్డం రవి, దోన్పాల్ సాయన్న, జక్క పద్మారావు, బరిగేడి మల్లేష్ యాదవ్, షేక్ ఆరిఫ్ తదితరులు పాల్గొని సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
