- అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో నగరంలోని ప్రతి డివిజన్లో ప్రజలకు కావలసిన మౌలిక వసతులను సమకూర్చడానికి అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని 24, 34, 37, 39 డివిజన్లో మంగళవారం నగర మేయర్ నీతు కిరణ్ తో కలిసి సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు. హలో డివిజన్లోని ఆయా కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించే విధంగా తన వంతు ప్రయత్నిస్తున్నానని అన్నారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా నగర అభివృద్ధి కోసం ముందుండి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో నగరంలో లోటట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం జిల్లా ఇన్చార్జి మంత్రి, ఆప్కారి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పిసిసి అధ్యక్షుడుతో ఇటీవల చర్చించినట్లు తెలిపారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారని రాష్ట్రం నుంచి వచ్చిన నిధులతో పాటు, కేంద్రం నుండి కూడా నగర అభివృద్ధి కోసం తన వంతు ప్రత్యేక చొరవ చూపిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నగరంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ అయినా నాయకులు నగర అభివృద్ధి కోసం ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్ తో పాటు అయ్యా డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

