ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో నగర అభివృద్ధి చేసుకుందాం

 అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో  నగరంలోని ప్రతి డివిజన్లో ప్రజలకు కావలసిన మౌలిక వసతులను సమకూర్చడానికి అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని 24, 34, 37, 39 డివిజన్లో మంగళవారం నగర మేయర్ నీతు కిరణ్ తో కలిసి సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు....