27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

డిజిటల్ బ్యాంకింగ్ లో అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎస్ బిఐ బ్యాంక్ మేనేజర్ శ్వేత

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

నేటి యువత డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్ బిఐ బ్యాంక్ మేనేజర్ శ్వేత అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ యూనిట్ – IV ఆధ్వర్యంలో ఎస్ బిఐ సహకారంతో “ఎంపవరింగ్ స్టూడెంట్స్ విత్ ఫైనాన్సియల్ నాలెడ్జ్ ఫర్ ఆ సెక్యూర్ టుమారో” అనే నినాదంతో మంగళవారం బ్యాంకింగ్ సేవల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ బ్యాంక్ ఓటీపీ లను ఎవరితోనూ పంచుకోవద్దని, సురక్షిత లావాదేవీలే మన ఆర్థిక భవిష్యత్తుకు బలమని సూచించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా.అపర్ణ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండే పొదుపు అలవాటు చేసుకోవాలని, చిన్న మొత్తం నుండే పొదుపు ప్రారంభిస్తే భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరంగా ఉంటారని హితవు పలికారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రభుత్వ అందించే విద్యా రుణాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంకింగ్ పై అవగాహన ఉంటేనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ – IV వాలంటీర్లు, ఎస్ బీఐ టీమ్ సందీప్, శ్రీనివాస్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article