27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మద్నూర్‌లో కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ :

 

మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆదివారం కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 కోట్లతో మద్నూర్‌లో నూతన ఎంఆర్వో భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

 

Distribution of Kalyana Lakshmi and Shaadi Mubarak cheques in Madnoor.

More articles

Latest article