మద్నూర్‌లో కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
జుక్కల్, బతుకమ్మ : మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆదివారం కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 కోట్లతో మద్నూర్‌లో నూతన ఎంఆర్వో భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,...