27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కౌలాస్ ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని ప్రముఖ కౌలాస్ ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కౌలాస్ గ్రామానికి చెందిన అడ్వకేట్ అనుప్ కుమార్ సింగ్ దొర, అన్షుల్ సింగ్ దంపతులు తమ వివాహానంతరం నిర్వహించిన ప్రత్యేక పూజలకు జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నూతన దంపతులు అనుప్ కుమార్ సింగ్ దొర, అన్షుల్ సింగ్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

More articles

Latest article