కౌలాస్ ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

  జుక్కల్, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని ప్రముఖ కౌలాస్ ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కౌలాస్ గ్రామానికి చెందిన అడ్వకేట్ అనుప్ కుమార్ సింగ్ దొర, అన్షుల్ సింగ్ దంపతులు తమ వివాహానంతరం నిర్వహించిన ప్రత్యేక పూజలకు జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అమ్మవారికి ప్రత్యేక...