29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

నీట్ బాధిత విద్యార్థులకు న్యాయం కావాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు

 

. . . డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

 

జుక్కల్, బతుకమ్మ :

 

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో, దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థుల ఉద్యమాలకు సంఘీభావంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు (డీసీసీ) ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లోక్‌సభలో నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ నిర్వహించాలని, పేపర్ లీక్‌పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ కార్యకర్తలు, విద్యార్థులు, యువత, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Students affected by NEET deserve justice.

More articles

Latest article